NTV Telugu Site icon

ఈటల బీజేపీకి వెళ్తే.. కేసీఆర్ కే నష్టం: సీపీఐ నారాయణ

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతుండటంతో బీజేపీ-టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లడం సీఎం కేసీఆర్ కు నష్టమేనని అన్నారు. తెలంగాణ మరో బెంగాల్ లా మారకుండా జాగ్రత్తపడాలని నారాయణ సూచించారు. అలాగే ఏపీ సీఎం జగన్ బెయిల్ గురించి కూడా మాట్లాడుతూ.. జగన్ కు బెయిల్ రద్దు అయ్యే అవకాశాలున్నాయని అన్నారు. సీఎం జగన్ అవలంభిస్తున్న విధానాలపై నారాయణ మండిపడ్డారు. కేంద్రాన్ని విమర్శిస్తూ జార్ఖండ్ సీఎం లేఖ రాసినప్పుడు వారించిన జగన్.. ఇప్పుడు ఎందుకు పక్క రాష్ట్రాల సీఎంలతో బలం కూడగడుతున్నారని నారాయణ ప్రశ్నించారు.