NTV Telugu Site icon

CPI Narayana: మాకు మంచి బలం వుంది.. గెలుపుఓటములు నిర్ణయిస్తాం

Cpi Narayana

Cpi Narayana

తెలంగాణలో ఇప్పుడు మునుగోడు (munugode Bypoll) పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. మునుగోడు సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం అక్కడ జెండా పాతేస్తాం అంటున్నారు. ఈనేపథ్యంలో తెరమీదకు వచ్చిన సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో మాకు మంచి బలం ఉంది. మా ముందు మూడు ఆప్షన్ లు (three Options) ఉన్నాయన్నారు. వాటిపైనే చర్చ చేస్తున్నాం అన్నారు నారాయణ.

Read Also:RajaGopal Reddy: నిధులు ఇవ్వని సీఎం, మునుగోడుకు ఎలా వస్తారు..

పార్టీ లో అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. వయసుకు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే… మంచి సంబంధం చూసి ఇస్తాం కదా..? అలాగే టీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతు అడుగుతున్నా యి ఆలోచిస్తున్నాము.. మేము ఏం నిర్ణయం తీసుకోనప్పుడు .. మద్దతు అడిగే వారికి ఏం చెప్తాం? మేము సొంతంగా పోటీ చేయాలా..? అనే ఆప్షన్ కూడా ఉంది. రేపటి మధ్యాహ్నం నాటికి ఒక ప్రకటన చేస్తాం. టీఆర్ఎస్, కాంగ్రెస్ లో కూడా కుమ్ములాటలు ఉన్నాయి. మునుగోడులో గెలుపు ఓటములను మేమే డిసైడ్ చేస్తాం. ఎంత మంచి వ్యక్తి అయినా… బీజేపీని ఓడిస్తాం అన్నారు నారాయణ (Narayana).మరి సీపీఐ ఎవరికి మద్దతు ఇస్తుందో చూడాలి.

Read Also: Chandoo Mondeti : అమితాబ్‌ బచ్చన్‌తో ‘కార్తికేయ’ దర్శకుడు..