CPI Narayana: దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు..? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్ CPI ఆఫీస్ లో CPI 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ నేతలు నారాయణ, సురవరం, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కునమనేని సాంబశవరావు హాజరయ్యారు. వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా CPI నేతలు జెండా విష్కరించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. 1917 కు ముందు విశ్వంలో ఒకే గ్లోబ్ ఉండేదన్నారు. 1917 సోవియట్ విప్లవం వచ్చిన తరువాత విశ్వంలో ఒక ఎర్ర చుక్క పొడిచిందన్నారు. సోవియట్ విప్లవం ఒక గుణాత్మకమైన మార్పు వస్తుందని అన్నారు. బ్రిటీష్ దొరలను తరమాలని అనుకున్నారు తప్ప ఎలాంటి స్వాతంత్ర్యం కావాలని ఎవరు అనుకోలేదన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తరువాతే స్పష్టమైన స్వాతంత్ర్య రాజ్యాంగ దేశం ఏర్పడిందన్నారు. దున్నే వాడికి భూమి కావాలనే ఉద్యమం నుంచి సాయుధ పోరాటంతో వరకు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిర్భాందాలను ఎదుర్కొందన్నారు.
Read also: Tiger in Pilibhit: వీధుల్లో షికారు చేస్తున్న పులి.. భయంతో మేడలెక్కిన జనం
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
దేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం.. భిన్నత్వంలో ఏకత్వంలా దేశం బలంగా ఉండాలని కోరుకుంటామన్నారు. ఇవాళ దేశం విచ్ఛిన్నo చేసేందుకు విభజించు పాలించు అనే పద్ధతిలో పాలక గణాలు, ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు. కులాలు, మతాల పేరు మీద దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందన్నారు. స్వతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర లేదని అన్నారు. దేశ స్వాతంత్ర్యoలో కమ్యూనిస్ట్ పార్టీ వేల మంది అమరులను పోగొట్టుకుందని తెలిపారు. వారసత్వ ఉద్యమం స్ఫూర్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. దేశం విచ్ఛిన్నం అవుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ.. కానీ అదే ఆద్వానిని రామ మందిర ప్రారొంబొత్సవానికి రావొద్దని చెప్పారని తెలిపారు. బీజేపీ మోస్ట్ క్రిమినల్ గవర్ణమెంట్ అన్నారు. క్రిమినల్ గ్యాంగ్, మోడీ, అమిత్ షా, అని మండిపడ్డారు. క్రిమినల్ గ్యాంగ్ దేశాన్ని పరిపాలిస్తోందన్నారు. దేశ సంపదను ఆదాని చేతికి అప్పజెతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమని చెప్తున్నారని అన్నారు. ఉప చట్టాలను మరింత ప్రమాదకరoగా తయారుచేస్తున్నారని తెలిపారు. దేశానికి రైట్ వింగ్ ప్రమాదకరమా..? అని ప్రశ్నించారు.
Read also: Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయి
లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమా అనేది తెల్సుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని ద్వంసం చేస్తున్నారని అన్నారు. మనుధర్మాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ తో పాటు విచారణ సంస్థల్ని పెంపుడు కుక్కల్లా తయారు చేశారని అన్నారు. ఇండియా పేరు చూసి మోడీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా కాషాయ మయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్లమెంట్ పై దాడి జరిగిందన్నారు. దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎట్లా ఇచ్చారు? అని ప్రశ్నించారు. పాసులిచ్చిన బీజేపీ ఎంపీ పై చర్యలు తీసుకోకుండా నిరసన తెలిపిన సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. పై స్థాయిలో బిల్లులను అమొదించుకోవడానికి పార్లమెంట్ పై దాడికి ప్లాన్ చేసుకున్నారని తెలిపారు. దేశాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మోడీ ప్రజాస్వామ్యాన్ని తెచ్చెందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ కార్డు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తింపు ఉంటదన్నారు.
Vishal: న్యూయార్క్ లో ఆమెతో చెట్టాపట్టాల్.. కెమెరా చూసి ముఖం దాచి పరిగెత్తిన విశాల్?
తాజావార్తలు
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..