NTV Telugu Site icon

ఎన్నికలా.. పగటి డ్రామాలా?

తెలంగాణలో జరగబోయే హుజూరాబాద్ ఎన్నికలపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. తెలంగాణాలో జరిగే ఎన్నికలు పగటి డ్రామాలా లేక పవిత్ర ఎన్నికల విధానాలా అని విమర్శించారు. ఎన్నికల విధానాలను భ్రష్టు పట్టించేవిగా వున్నాయన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగం గానే దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని, అయితే అందులో కూడా దళిత బంధు ఇచ్చినట్టే వుండాలి. పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు అందకూడదన్న చందంగా తయారైందన్నారు.

కూడు కుండనిండుగుండాలి , బిడ్డమాత్రం బొద్దుగుండాలి ” అన్నట్టుగా వుందన్నారు నారాయణ. ఈనాటకాలలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ పోటీలుపడి ఎన్నికల ప్రక్రియను అవమానపరుస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతికంగా నోటిఫికేషన్ తేదీలను చూడకుండా పథకం ప్రారంభించారన్నారు. పథకం పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల యంత్రాంగం పరిశీలించాలని నారాయణ కోరారు.