NTV Telugu Site icon

ఈట‌ల ప‌చ్చి అవ‌కాశ‌వాది.. మ‌తోన్మాద పార్టీలో చేరుతూ మాపై నింద‌లా..?

Chada Venkat Reddy

మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు సీపీఐ నేత చాడా వెంక‌ట్‌రెడ్డి.. టీఆర్ఎస్‌కు రాజీనామా సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు.. ఈటల పచ్చి అవకాశవాద‌ని వ్యాఖ్యానించిన చాడా… మతోన్మాద పార్టీ (బీజేపీ)లో చేరుతూ సీబీఐ మీద నింద‌లు వేస్తారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు… టీఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వం ధ‌ర్నా చౌక్‌ను ఎత్తివేస్తే మా పార్టీ కార్యాల‌యాన్నే ధ‌ర్నా చౌక్‌గా మార్చిన చ‌రిత్ర సీపీఐది అన్న ఆయ‌న‌.. అసైన్ భూములు ఎవరు కొన్నా త‌ప్పే.. ఈట‌ల రాజేంద‌ర్ వెంటనే ఆ భూములు ప్రభుత్వానికి అప్పగించాల‌ని డిమాండ్ చేశారు.. కాగా, నాది క‌మ్యూనిస్టు డీఎన్ఏ అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల ఒత్తిడి మేర‌కు బీజేపీ చేరుతున్నాన‌ని మీడియా చిట్‌చాట్‌లో వెల్ల‌డించిన ఈటెల రాజేంద‌ర్.. రాష్ట్రంలో మ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ మార్గ‌నిర్దేశంలోనే ప‌నిచేస్తున్నాయంటూ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.