NTV Telugu Site icon

Hyderabad: రంజాన్‌ మాసం.. చార్‌మినార్‌ వద్ద వ్యాపారులకు నగర సీపీ గుడ్ న్యూస్‌

Charminar Naight Viues

Charminar Naight Viues

Hyderabad: ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసాలలో రంజాన్ ఒకటి. ఇస్లాంలో ఈ నెల చాలా ముఖ్యమైనది. ముస్లింలు ఉపవాసాలు, ప్రార్థనలు, సామూహిక భోజనాలు చేస్తూ నెల రోజులు గడుపుతారు. రంజాన్ ముగింపు సందర్భంగా ఈద్ అల్-ఫితర్ జరుపుకుంటారు. అయితే రంజాన్ మాసమంతా రాత్రి వేళల్లో షాపులు తెరిచి ఉండటం ఆనవాతీ.. ఎందుకంటే రాత్రి ఒక్కపొద్దు ఉన్నవారు బయట హోటల్లో సహారీ(ఉదయం లేచి తినడం) చేస్తారు. అందువల్ల రాత్రంతా అంగల్లను తెరిచే ఉంచుతారు. కొందరు రాత్రుల్లు అంగల్లను తెరిచి ఉంచేందుకు అనుమతించడం లేదని చార్మిన్ వద్ద పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసంలోనే తమకు రాత్రిపూట గిరాకీ ఉంటుందని వాపోయారు. ఈనేపథ్యంలో నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ముస్లీంలకు శుభవార్త చెప్పారు. రంజాన్‌ మాసంలో రాత్రంతా వ్యాపారాలు కొనసాగించవచ్చని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

Read also: Viral Photo: కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న నేత..!

రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రాత్రి దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్యతో కలిసి పాతబస్తీలో పర్యటించారు. మదీనా నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తూ స్థానికులను మర్యాదపూర్వకంగా పలకరించారు. వ్యాపారాలు ఎలా సాగుతున్నాయని చిరు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. కొందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మదీనా, పట్టరగట్టి, మీరాలమ్మండి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్‌ మీదుగా చార్మినార్‌కు చేరుకుని దారిలో ట్రాఫిక్‌, శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రంజాన్‌ మాసం ముగిసే వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాత్రంతా వ్యాపారాలు కొనసాగించవచ్చన్నారు. జేబు దొంగల పట్ల వినియోగదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పర్యాటకులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్‌కు తగిన ఏర్పాట్లు చేశారు.
Viral Photo: కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న నేత..!