Hyderabad: రంజాన్ మాసం.. చార్మినార్ వద్ద వ్యాపారులకు నగర సీపీ గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసాలలో రంజాన్ ఒకటి. ఇస్లాంలో ఈ నెల చాలా ముఖ్యమైనది. ముస్లింలు ఉపవాసాలు, ప్రార్థనలు, సామూహిక భోజనాలు చేస్తూ నెల రోజులు గడుపుతారు. రంజాన్ ముగింపు సందర్భంగా ఈద్ అల్-ఫితర్ జరుపుకుంటారు. అయితే రంజాన్ మాసమంతా రాత్రి వేళల్లో షాపులు తెరిచి ఉండటం ఆనవాతీ.. ఎందుకంటే రాత్రి ఒక్కపొద్దు ఉన్నవారు బయట హోటల్లో సహారీ(ఉదయం లేచి తినడం) చేస్తారు. అందువల్ల రాత్రంతా అంగల్లను తెరిచే ఉంచుతారు. కొందరు రాత్రుల్లు అంగల్లను తెరిచి ఉంచేందుకు అనుమతించడం లేదని చార్మిన్ వద్ద పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసంలోనే తమకు రాత్రిపూట గిరాకీ ఉంటుందని వాపోయారు. ఈనేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ముస్లీంలకు శుభవార్త చెప్పారు. రంజాన్ మాసంలో రాత్రంతా వ్యాపారాలు కొనసాగించవచ్చని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
Read also: Viral Photo: కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న నేత..!
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాత్రి దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్యతో కలిసి పాతబస్తీలో పర్యటించారు. మదీనా నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తూ స్థానికులను మర్యాదపూర్వకంగా పలకరించారు. వ్యాపారాలు ఎలా సాగుతున్నాయని చిరు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. కొందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మదీనా, పట్టరగట్టి, మీరాలమ్మండి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ మీదుగా చార్మినార్‌కు చేరుకుని దారిలో ట్రాఫిక్, శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రంజాన్ మాసం ముగిసే వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాత్రంతా వ్యాపారాలు కొనసాగించవచ్చన్నారు. జేబు దొంగల పట్ల వినియోగదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పర్యాటకులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్‌కు తగిన ఏర్పాట్లు చేశారు.
Viral Photo: కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న నేత..!
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!