NTV Telugu Site icon

Realtors Murder Case: స్కెచ్‌ వేసింది ఆయనే.. ఇలా జరిగింది-సీపీ

హైదరాబాద్ శివారులోని కర్ణంగూడలో జరిగిన రియల్టర్ల హత్య కేసులో మిస్టరీ వీడింది. ఇద్దరు రియలెస్టేట్‌ వ్యాపారులపై కాల్పుల కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, 10 తూటాలు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వివాదాలతోనే శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డిపై ప్రత్యర్థులు కాల్పులు జరపగా… ఇద్దరు మృతి చెందారు. కాల్పుల్లో ఇద్దరు చనిపోవడంతో ప్రత్యేక కేసుగా విచారణ జరిపిన పోలీసులు… మిస్టరీని ఛేదించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులు మత్తారెడ్డి, అశోక్‌రెడ్డి, ముజాహిద్దీన్‌, భిక్షపతి, షమీం, రహీమ్‌ను అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించామన్నారు సీపీ మహేష్‌ భగవత్‌.

హత్యలకు మొత్తం స్కెచ్‌ వేసింది మట్టారెడ్డే అని తేలింది. మట్టారెడ్డికి గతంలో నేర చరిత్ర కూడా ఉంది. బిహార్‌ నుంచి తుపాకులు, మందు గుండు సామగ్రి కొన్నారు. రియలెస్టేట్‌ వ్యాపారులపై భిక్షపతి, మొహినుద్దీన్‌ కాల్పులు జరిపారు. ప్రాథమిక విచారణలో మట్టారెడ్డి తమకు సహకరించలేదన్నారు సీపీ. అతని గెస్ట్‌ హౌస్‌ దగ్గర సీసీ ఫుటేజీ దొరకడంతో కేసులో కీలక ఆధారం లభించిందని సీపీ మహేశ్‌ భగవత్‌ చెప్పారు. ఇక, ఈ సందర్భంగా సీపీ మహష్‌ భగవత్‌ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి…