పాదచారుల కోసం పెలికాన్ సిగ్నళ్లను హైదరాబాద్ పోలీసులు బుధవారం అందుబాటులోకి తెచ్చారు. నగరంలోని వేర్వేరు రోడ్లపై అమర్చారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్‌ను హైదరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పూర్తిస్థాయిలో ప్రజలు వినియోగించడం లేదన్నారు. ట్రాఫిక్ లో రోడ్ దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ చాలా ఉపయోగపడుతాయని, అందుకే.. హైదరాబాద్ లో 30 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పెలికాన్ సిగ్నల్ వద్ద వాలెంటీర్స్ ఉంటారని, ప్రతి ఏడాది రోడ్ ప్రమాదాల్లో 45 శాతానికి పైగా పాదాచరులే చనిపోతున్నారన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 మంది పాధాచరులు చనిపోయారని ఆయన వెల్లడించారు. రోడ్ దాటుతున్న సమయాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే పెలికాన్ సిగ్నల్ ద్వారా రోడ్ ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
Also Read : Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్
మహిళల భద్రత గురించి సేఫ్ సిటీ ప్రాజెక్టు లో ఎన్నో తీసుకోని వచ్చామని, పాదాచరుల కోసం పెలికాన్ సిగ్నలింగ్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుందని, మూడు కమిషనరేట్ పరిధిలో ఇలాంటివి సిగ్నల్ సిస్టమ్ లు ఉన్నాయన్నారు సీపీ ఆనంద్. ఈ పెలికన్ సిగ్నలింగ్ సిస్టమ్స్ దగ్గర ట్రైన్ అయిన వారిని ఉంచుతున్నామని, కొన్ని దేశాల్లో ఇలాంటి సిస్టమ్ ఆటోమేటిక్ గా వుంటుందన్నారు. కానీ.. ఇక్కడ ట్రాఫిక్ పై అంత అవగాహన లేదూ… అందుకే ప్రతి సిగ్నలింగ్ సిస్టమ్ వద్ద ట్రైన్ అయిన వారు ఆపరేట్ చేస్తూ ఉంటారన్నారు. పాదచారుల కోసం నగరంలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి… ఫుట్ ఓవర్ బ్రిడ్జి లునున్నయి..కానీ వాటిని ఎవరూ వాడట్లేదన్నారు. ఎక్కడ పాదచారుల కోసం ఫుట్ పాత్ లు ఉండట్లేదు.. 500 గజాలు లేకుండ అంత షాప్ లతో , టాయ్లెట్ లతో ఉండిపోతుందన్నారు. ప్రభుత్వం ఎన్నో చేస్తుంది… ట్రాఫిక్ వాళ్ళని ఆదుకుంటుందని, నగర ప్రజలకు అవగాహన అవసరమన్నారు. ఈ సిగ్నల్ వ్యవస్థ పాదాచరులు ఎక్కువ ఉన్న చోట ఏర్పాటు చేస్తున్నామని, ఇవాళ ట్రాఫిక్ పోలీస్ ల కోసం బ్యాగ్ కిట్, బాడీ ఓన్ కెమెరా లు కిట్స్ అందించామని ఆయన తెలిపారు. ఎండ లో ఉంటూ ఎంతో చేస్తున్న వీరికి ప్రభుత్వం 30 శాతం ఎక్కువ జీతాలు ఇస్తుందని, బాడీ ఓన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ వయోలెటర్స్ బిహేవియర్ అన్ని తెలుస్తాయన్నారు.
Also Read : “NIPPO” తన స్వర్ణోత్సవ వేడుక వేదికగా సరికొత్త “Brand logo” ఆవిష్కరణ
