ఫస్ట్ వేవ్‌లోనే చాలా మంది ప్రజాప్రతినిధులను పలకరించిపోయింది కరోనా మహమ్మారి.. కొందరు నేతలు, ప్రముఖుల ప్రాణాలు సైతం తీసింది.. తాజాగా, సెకండ్ వేవ్ కలవర పెడుతుండగా.. మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో.. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని.. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ తనను కలవడానికి రావొద్దని, ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని కోరారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. మరోవైపు.. అంబేద్కర్ జయంతి సందర్బంగా తాండూరు పర్యటనలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిదని.. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
Pilot Rohit Reddy