Site icon NTV Telugu

Rangareddy: ప్రాణం తీసిన అప్పుల‌బాధ‌.. చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య..

Susaid

Susaid

కుటుంబం కోసం అప్పులు చేయ‌డం అది తీర్చ‌లేక ప్రాణాల‌మీద‌కు తెచ్చుకోవ‌డం. ఏప‌ని చేసిన‌, ఎంత శ్ర‌మించిన అప్పుల పెరుగుతూనే వుంటాయి త‌ప్పాత‌ర‌గ‌డంలేద‌ని భావించి చివ‌ర‌కు ఆత్మ‌హత్య‌ల‌కు పాల్ప‌డ్డాడు ఓ వ్యక్తి. నేను పోతే నాకుటుంబం పై భారం ప‌డుతుందేమో అనుకున్నాడో ఏమో ఆతండ్రి చిన్న‌పిల్ల‌లు అని కూడా చూడకుండా.. ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది.

రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడలో విషాదం నెలకొంది. ఆదిబట్ల పరిధిలోని కుర్మల్‌గూడ చెరువులో దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి పురుగుల మందు తాగి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారే సరికి తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు చెరువులో తేలాయి. మరో మహిళ మృతదేహం కోసం స్థానికులు గాలిస్తున్నారు.

మృతులను మలక్‌పేటకు చెందిన కుద్దూర్‌, ఫిర్దోస్‌, మెహక్‌ బేగంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తున్నది. ఇద్దరు కూతుళ్లతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

https://www.youtube.com/watch?v=kEuW8bIYIAE

Exit mobile version