తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దారుణమైన పరిస్థితులలో ఉంది. ప్రతి రోజు రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.ఈ రోజు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,707 కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజా గా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 2,707 కేసులు వెలుగు చూశాయి. కాగ నిన్న రాష్ట్రంలో 2,319 కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 388 కేసులు పెరిగాయి.
Read Also: సమానత్వం కోరే వారందరూ రామానుజుల విగ్రహాన్ని సందర్శించాలి: భట్టి విక్రమార్క
ప్రతి రోజు గతంతో పోలిస్తే.. సుమారు 400 కేసులు పెరుగుతున్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతున్న జిల్లాల్లో.. జీహెచ్ఎంసీ నుంచే ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. ఈ రోజు కూడా జీహెచ్ఎంసీలో 1,328 కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటలలో కరోనా కారణంగా ఇద్దరూ మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 582 మంది కరోనా నుంచి కొలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 20,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 84,280 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
