Site icon NTV Telugu

Hyderabad: రాజ్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం.. ఉద్రిక్త‌త‌

Jaggaredy

Jaggaredy

హైద్రాబాద్ లోని రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డికి కాంగ్రెస్ నేత‌లు ముట్ట‌డికి పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. విడతల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్డడికి వచ్చారు. మోదీ కొ హటావ్ దేశ్ కొ బచావ్ అనే నినాదాలతో రాజ్ భవన్ అట్టుడికింది. ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వావాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

ఖైరతాబాద్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ కు నిప్పు పెట్టి నిరసనకు దిగారు. మరో వైపు బస్సును రోడ్డుపై నిలిపివేసి బస్సుపైకి ఎక్కి ఆందోళన నిర్వహించారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ సెంటర్లో రోడ్డుపైనే కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయడంతో ట్రాఫిక్ రోడ్డుపైనే నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ వైపు వెళ్లకుండా ఖైరతాబాద్ సెంటర్ నుండి రాజ్ భవన్ సెంటర్ వైపునకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను జగ్గారెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, అంజన్ కుమార్ అదుపులో తీసుకున్నారు. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఖైరతాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకొందని జగ్గారెడ్డి చెప్పారు.

శాంతి యుతంగా తాము ఈడీ కార్యాలయం ముందు రెండు రోజులు ఆందోళనలు చేసిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. రాజ్ భవన్ వద్ద నిరసన చేసి గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకోవడమే బైక్ దగ్దం, బస్సు అద్దాలు ధ్వంసానికి కారణమైందని జగ్గారెడ్డి ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మోదీ దేశాన్న అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డుపై బైఠాయించి టీపీసీసీ రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు. ఈడీ డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు.

న్యూఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేసిన దాడులను నిరసిస్తూ ఇవాళ దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీని ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (Rahul Gandhi ని Enforcement Directorate) అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ నెల 15న ఢిల్లీ పోలీసులు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వ్యవహరించారని ఆపార్టీనేత రణదీప్ సుర్జేవాలా చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఢిల్లీ పోలీసులు ఎలా వ్యవహరించారో వీడియోను కూడా ప్రదర్శించారు.

ఢిల్లీలో కార్యకర్తలపై పోలీసుల దాడులు నిర్వహించారు. దీంతో రేపు రాజ్‌భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
నేషనల్ హెరాల్డ్ కేసులో మూడు రోజుల పాటు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు.అయితే రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

BJP : అధికారంలో ఉన్నా లేకున్నా ఏపీలో అందరి పిలకలు బీజేపీ చేతిలోనే ఉంటాయా..? |

Exit mobile version