CM Revanth Reddy: మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జీ షీట్.. విడుదల చేసిన సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రధాని మోడీ పదేళ్ల పాలనపై తెలంగాణ కాంగ్రెస్ చార్జీ షీట్ ధాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 12.20 గంటలకు ఛార్జి షీట్ ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పదేండ్ల మోసం- వందేడ్ల విధ్వంసం అంటూ చార్జీషీడ్ విడుల చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపారు. పదేండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం అనే కాంగ్రెస్ చార్టీషీట్ ను సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ చార్జీషీట్ ఇవే..
Also Read
తెలంగాణకు చేసిన ద్రోహం..
*మోడీ పార్లమెంట్ సాక్షిగా పదే పదే తెలంగాణ ఏర్పాటును ఎగతాలి చేశారు
*విభజన హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అమలు చేయలేదన్నారు.
*811 టీఎంసీ కృష్ణా జలాలలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను దక్కకుండా చేశారని పేర్కొన్నారు.
విద్యా సంస్థల ఏర్పాటులో మోసం
* తెలంగాణకు ఒక్క ఐఐఎం, ఐఐఐటీ, కేంద్ర యూనివర్శిటీ, మెడికల్ కాలేజీనైనా ఇయ్యలే.
* నవోదయ & కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో తెలంగాణపై వివక్ష M
మోడీ జుమ్లాలు
* ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలిస్తాం
* 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం
* 2022 కల్లా అందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం
* 100 రోజుల్లో నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తాం
*నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తాం
*అవినీతిని పూర్తిగా రూపుమాపుతాం
*నోట్ల రద్దుతో నల్లధనం నిర్మూలన
* దేశ భూభాగంలో చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు.
సామాన్యుడిపై ధరల మోత
* పదేండ్లలో బియ్యం, పప్పు, నూనె, పాలు, చక్కెర ధరలు మూడింతలు పెంపు.
* రూ.110 దాటిన పెట్రోల్, రూ.1200 దాటిన సిలిండర్ ధర.
నిధుల విడుదలలో వివక్ష
తెలంగాణ కేంద్రానికి రూపాయి పంపిస్తే, కేవలం 43 పైసలని మాత్రమే తిరిగిస్తున్నది. కానీ, బీహారు – రూ.7.06, యూపీకి రూ.2.73, అస్సాంకు రూ.2.63, మధ్య ప్రదేశ్ కు రూ.2.42 ఇస్తుంది
రైతు వ్యతిరేకి బీజేపీ
* లక్షకు పైగా రైతుల ఆత్మహత్య.
* రైతు రుణమాఫీ చేయలే కానీ, కార్పొరేట్లకు రూ.25 లక్షల కోట్ల రుణాల మాఫీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేకి మోడీ
* కులగణనను వ్యతిరేకిస్తున్న మోడీ.
* రోజూ దళితులపై 157, ఆదివాసులపై 28 దాడులు.
దేశాన్ని అమ్మేస్తున్న మోడీ
* రూ.60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం రూ.6 లక్షల కోట్లకే కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టిండు.
* స్విస్ బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన నల్లధనం. రూ.8,392 (2015) కోట్ల నుండి రూ.30,500 (2021) కోట్లకు పెరుగుదల.
దేశ సార్వభౌమత్వానికి భంగం
2000 చదరపు కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా.
ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్
* ఎలక్ట్రోరల్ బాండ్ల పేరుతో రూ. లక్ష కోట్ల భారీ స్కామ్.
*ప్రైవేటు కంపెనీల దగ్గర చందాలు వసూ చేసి ప్రాజెక్టుల మంజూరు, మరియు IT, CBI దాడుల నుండి రక్షణ.
తాజావార్తలు
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..