NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నికలు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన నిర్ణయం…

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

మునుగోడు ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీచేసేందుకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు విజయం మాదేనని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కానీ, ఆ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు తనకు ఆహ్వానం లేదంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉండడంపై పెద్ద చర్చే జరిగింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికలపై రేవంత్‌రెడ్డి అప్పుడే చేతులు ఎత్తేశారని ఆరోపించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. గెలుస్తాం అని చెప్పాలి.. కానీ, ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశారని విమర్శించారు. ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన ఎన్నికను… వెంట్రుక కూడా కాదు అంటే ఎట్లా ..? అని ప్రశ్నించారు.

Read Also: Komatireddy Venkat Reddy Live : మునుగోడు ప్రచారానికి వెళ్లను.!

అయితే, చండూరు సభలో తనను కావాలనే తిట్టించారని మండిపడ్డారు కోమటిరెడ్డి.. సభలో జరిగిన వ్యవహారంపై రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన ఆయన.. గట్టిగా మాట్లాడే వారు ఉంటే ఇబ్బంది అని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తారా? అని ప్రశ్నించగా.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.. ఎప్పటికైనా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పిలవని పేరంటానికి వెళ్లడం అలవాటు లేదు.. అందుకే నేను మునుగోడు ప్రచారానికి వెళ్లబోన్నారు.. నా మీద చండూరు సభలో మాట్లాడిన వ్యక్తి చిన్న పిల్లగాడు.. నన్ను కావాలని తిట్టించారు.. ఈ విషయంలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.. ఆయనకు టికెట్ ఇప్పించి సపోర్ట్ చేసింది మేమేనని గుర్తుచేసుకున్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి..