NTV Telugu Site icon

దళిత బంధు కాదు.. చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతావు..!

Jeevan Reddy

ద‌ళిత బంధు ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలోని అన్ని ద‌ళితు కుటుంబాల‌కు విడ‌త‌ల వారీగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.. రైతు బంధు త‌ర‌హాలో ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తామ‌ని.. ప్ర‌భుత్వ ఉద్యోగి ఉన్న ద‌ళిత కుటుంబానికి కూడా ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.. అయితే, దళితబంధు కాదు.. చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతావు అంటూ సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి.. దళితులకు సంబందించిన 30వేల కోట్ల రూపాయలని కమీషన్ల కోసం దారి మ‌ళ్లీంచావు అని ఆరోపించిన ఆయ‌న‌.. 30 వేల కోట్ల రూపాయలతో దళితులకు రాష్టంలో 6 లక్షల డబుల్ బెడ్ రూమ్ లు అయ్యేవ‌ని.. కేవలం ప్రకటనలు ప్రచారాలకు కాకుండా పథ‌కాలను నిర్మాణాత్మ‌క కార్యాచరణ ప్రణాళిక ఎందుకు చెప్ప‌రు అని ప్ర‌శ్నించారు.. ఇక‌, మాంత్రి కొప్పుల ఈశ్వర్ అంటే నాకు అభిమానం.. సీనియర్ మోస్ట్ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాన‌ని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి.