Site icon NTV Telugu

కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. అది వాస్తవమే..!

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా హాట్‌ కామెంట్లు చేసిన కాక రేపిన ఆయన.. ఆ తర్వాత కాస్త సైలెంట్‌గానే ఉన్నారు.. అయితే, పీసీసీ చీఫ్‌ పదవి రేవంత్‌ రెడ్డికి ఇచ్చిన తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్లు చేసి.. ఆ తర్వాత ఇక పొలిటికల్‌ కామెంట్లు చేయనని ప్రకటించారు.. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో, పలు గ్రామాలలో శంకుస్థాపన, అభివృద్ధి పనులు ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాల తీసుకోవడం మూలంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిపోవడానికి కారణం సరైన నాయకత్వం లేకపోవడమే అన్నారు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఏ తప్ప చేయలేదు.. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు తలెత్తుకునేలా చేశారన్న ఆయన.. కొంతమంది స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఇచ్చే విషయంలో గానీ, పోరాటం చేసే విషయంలో సరైన పద్ధతిలో పని చేయకపోవడంతోనే తెలంగాణ కాంగ్రెస్ బలహీనపడేలా చేశారని మండిపడ్డారు.

ఇక, గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో, ప్రజా సమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ స్పందించకపోవడంతో నేను ఘాటుగా స్పందించాల్సి వచ్చిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు అని మాట్లాడిన మాట వాస్తవమే నన్న ఆయన.. రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేయడంతో కార్యకర్తలల్లో నిరుత్సాహం కలిగిందన్నారు.. మరోవైపు.. రేవంత్ రెడ్డిని టి.పీసీసీ అధ్యక్షుడుగా నియమించడంపై ప్రశ్నించగా.. నేను రేవంత్‌ను విమర్శడం గానీ.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడదలచుకోలేదన్నారు. రెండు సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్న విషయం వాస్తవమే.. కానీ, కాంగ్రెసు పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.

Exit mobile version