Site icon NTV Telugu

Jagga Reddy : సమాధానాలు చెప్పలేకే రాహుల్‌ టీ షర్ట్‌పై చర్చ..!

Jagga Reddy

Jagga Reddy

భారత్‌ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని.. బీజేపీ టార్గెట్‌ చేస్తోంది.. పాదయాత్రలో ఉపయోగిస్తున్న కంటైనర్ల నుంచి అనేక రకాల విమర్శలు సందిస్తున్నారు.. అంతేకాదు.. రాహుల్‌ గాంధీ ధరించిన టీషర్ట్‌పై ఇప్పుడు చర్చ సాగుతోంది.. అయితే, రాహుల్ గాంధీ టీ షర్ట్ మీద బీజేపీ మాట్లాడి దిగజారుడు పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీని ఏం విమర్శించాలో అర్దం కాక.. టీ షర్ట్ మీద విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. రాహుల్ గాంధీ.. బీజేపీ పెంచిన పెట్రో ధరలు, బ్లాక్ మనీ, ఉద్యోగాలపై అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీ షర్ట్ పై చర్చ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రోజుకు 20 లక్షల డ్రస్ లు మోడీ వేసినప్పుడు ఏమైంది.? అని ప్రశ్నించిన ఆయన.. రోజుకు మూడు డ్రెస్సులు మార్చే మోడీ ..60 లక్షలు ఖర్చు చేస్తున్నారు.. మోడీ ప్రజల సొమ్ముతో సోకులు పడుతున్నారు.. మోడీ 60 లక్షల ముందు రాహుల్ గాంధీ 40 వేల టీషర్ట్ ఎక్కడా..? అని ప్రశ్నించారు. మోడీ ప్రజల సొమ్ము ఖర్చు చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సొంత డబ్బులతో కొంటున్నారని తెలిపారు జగ్గారెడ్డి.

Read Also: Heavy Rains: ఏం వర్షాలు బాబోయ్.. 115 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేశాయి

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి నియోజక వర్గంలో 30 కిలీమీటర్ల మేర సాగుతుందని తెలిపారు జగ్గారెడ్డి.. ప్రారంభం నుండి ముగింపు వరకు… స్వాగతం పలికేందుకు ప్రజల్ని ఎక్కువ భాగస్వామ్యం చేస్తామన్న ఆయన.. పెట్రో, గ్యాస్ ధరలు భారం, అన్ని వర్గాల ప్రజలను రాహుల్ గాంధీ యాత్రలో భాగస్వామ్యం చేస్తాయన్నారు.. ఇక, ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నా.. ఇవాళ గాంధీ భవన్ లో జరిగే సమావేశానికి హాజరవుతానన్న ఆయన.. నియోజకవర్గానికి చెందిన పాదయాత్ర పై క్లారిటీ తీసుకుంటానని తెలిపారు. అయితే, శంషాబాద్ నుండి ముత్తంగి వరకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్ఆర్) పై యాత్ర వల్ల ఉపయోగం లేదన్నారు. ఆ రోడ్డు కంటే.. రాజేంద్ర నగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, పటాన్‌చెరు, సంగారెడ్డి మీదుగా వెళ్తే బాగుంటుందని.. దీనిపై పీసీసీతో మాట్లాడనున్నట్టు వెల్లడించారు జగ్గారెడ్డి.

Exit mobile version