కేసీఆర్ రాజకీయ వారసుడు ఆయనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయవారసుడిపై అప్పడప్పుడు చర్చ తెరపైకి వస్తూనే ఉంటుంది… ఏ ఎన్నికలు వచ్చినా.. ఇదిగో ఈ ఎన్నికల తర్వాత కాబోయే సీఎం కేటీఆరే నంటూ విమర్శలు వచ్చిన సందర్భాలు ఎన్నో.. ఇక, అంతా అయిపోయేది.. కేటీఆర్ సీఎం అవుతున్నారంటూ ప్రచారం సాగిన సందర్భాలు అనేకం.. మరికొందరు కేసీఆర్ రాజకీయ వారసుడు ఆయన మేనల్లుడు హరీష్‌రావు అనేవారు లేకపోలేదు.. కేటీఆర్ కంటే హరీష్‌రావు సీనియర్ అని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మరోసారి కేసీఆర్ వారసుడి ఇష్యూను తెరపైకి తెచ్చారు.. కేసీఆర్‌కి రాజకీయ వారసుడు కేటీఆరే అవుతాడన్న ఆయన.. అల్లుడు కాడు కదా వారసుడు..? అని ప్రశ్నించారు..
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రూ.10 వేలు ఇచ్చినట్టు… రాష్ట్రమంతా వర్షాలు వస్తున్నాయి కాబట్టి.. రాష్ట్ర వ్యాప్తంగా వర్షంతో నష్టపోయినవారికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి.. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని కోరిన ఆయన.. వర్షంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. సీఎం ఢిల్లీలో ఉన్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో కలెక్టర్లు ఉన్నారా..? అని ప్రశ్నించిన జగ్గారెడ్డి.. కలెక్టర్లు ఎమ్మెల్యేలకే దొరకడం లేదు అని విమర్శించారు. కలెక్టర్ కార్యాలయాలు బూతు బంగలాలు అయ్యాయంటూ మండిపడ్డారు.
Also Read
- CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
- CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్‌కు సవాల్.!
- Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
- CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
తాజావార్తలు
-
US: వర్జీనియా వర్శిటీలో కాల్పులు.. పలువురికి గాయాలు
-
Baa Baa Black Sheep: అక్టోబర్ 9న ‘బా బా బ్లాక్ షీప్’
-
El Nino: తీవ్ర స్థాయిలోకి ఎల్‌నినో.. శాస్త్రవేత్తలు హెచ్చరిక
-
Alibaba AI: మెటా, గూగుల్‌ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
-
Pakistan: “పాకిస్తాన్‌లోని 4% హిందువులను సహిస్తున్నాం”.. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!