Bhatti Vikramarka: వలస వాదులతో అసలు వారికి నష్టం జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ లో పుట్టి. పెరిగి భావజాలం నమ్మిన అనేక మందికి కమిటీ ఏర్పాటులో ఇబ్బంది ఏర్పడిందని అన్నారు. చాలా మంది పర్సనల్ గా వచ్చి కలుస్తున్నారని తెలిపారు. అసలు కాంగ్రెస్ నాయకులకు, వలస వాదులకు వ్యత్యాసం వచ్చిందని భట్టి తెలిపారు. జిల్లాల వారిగా మాతో మాట్లాడాలి కదా అని నన్ను అడిగారన్నారు. నా ఆశక్తత వ్యక్తం చేశా అని తెలిపారు. ఈ ప్రక్రియలో నేను పాల్గొనలేదు అని చెప్పా అన్నారు భట్టి. నేను కూడా వాళ్లకు జరిగిన నష్టానికి మనస్తాపానికి గురి అయ్యానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ని రక్షించుకోవాలని మేమంతా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు పోవాలని నిర్ణయించామన్నారు. కావాలని కొందరు నేతలను నష్టపరిచేలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ ని దెబ్బ తీస్తున్నారని, ఏడాదిన్నర నుండి జరుగుతున్నాయని ఆరోపించారు. కుట్ర పూరితంగా జరూగుతుందని అన్నారు. కాంగ్రెస్ ని హస్తగతం చేసుకోవాలని ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని భట్టి ఫైర్ అయ్యారు.
Read also: IRCTC Contractor Fined: రూ. 5 ఎక్కువగా వసూలు చేశాడు.. ఒక లక్ష ఫైన్ కట్టాడు
అయితే..తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల ప్రకటన చిచ్చు రేపిన విషయం తెలిసిందే.. కాగా.. పలువురు సీనియర్ నేతలు కమిటీల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. కొండా సురేఖ, బెల్లయ్య నాయక్ వంటి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయగా, పీసీసీ కమిటీలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇక, సీనియర్ల పేర్లు లేవని, సామాజిక సమతుల్యత లోపించిందని కొందరు తనతో చెప్పారని, తన దృష్టికి వచ్చిన అంశాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ నేతలు భట్టి విక్రమార్కను కలిసి వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇక.. మరోవైపు సీనియర్ నేత దామోదర రాజనర్సింహ పార్టీలో కోవర్టులు ఉన్నారనే కామెంట్స్ మరింత చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలోనే టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తీరుపై పలువురు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని భట్టి విక్రమార్క నివాసంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈసమావేశానికి మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, జగ్గారెడ్డి, డిప్యూజీ మాజీ సీఎం దామోదర్ రాజనర్సింహ, కోదండరెడ్డి, ప్రేమ్ సాగర్ హాజరయ్యారు. అయితే.. మరికొందరు నేతలు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నట్టుగా సమాచారం.
New Year Party Permissions: న్యూ ఇయర్ పార్టీ.. అనుమతులు తప్పనిసరి