Site icon NTV Telugu

VH: మళ్లీ సొంత పార్టీ నేతలను టార్గెట్‌ చేసిన వీహెచ్.. చెప్పినా పట్టించుకోరా..?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విబేధాలు ఉండకూడదు.. అంతా కలిసి కట్టుగా పనిచేయాలి.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ అధిష్టానం, రాహుల్‌ గాంధీ ఆదేశాలు జారీ చేశారు.. కానీ, మరోసారి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు.. ఆయన విమర్శలకు ప్రధాన కారణం అంబేద్కర్‌ విగ్రహమే.. అంబేద్కర్ విగ్రహం పోలీసులు ఎత్తుకు పోయారు అని కేసులు పెట్టినా.. ఇప్పటి వరకు చార్జిషీట్ వేయలేదని మండిపడ్డ ఆయన.. అవసరం అయితే ప్రాణ త్యాగం చేస్తా.. పంజాగుట్ట దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు.

Read Also: Pending Challans: వాహనదారులకు అలెర్ట్.. మరో 3 రోజులే డిస్కౌంట్‌ ఆఫర్..

ఇక, అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంపై మాట్లాడాలని కోరారు వీహెచ్‌.. మా పార్టీ నాయకులు కూడా మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. నాకు క్రెడిట్ వస్తుందని అనుకుంటున్నారేమో.. నేను కాంగ్రెస్ మనిషిని అన్నారు.. రేవంత్ రెడ్డికి కూడా చెప్పినా.. పట్టించుకోలేదు, భట్టి మొదట్లో పట్టించుకుని.. ఇప్పుడు వదిలేసిండు.. దళితుల ఓట్లు కావాలి.. కానీ, అంబేద్కర్ గురించి మాత్రం మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు..ఠాగూర్ కి కూడా చెప్పినా అయన కూడా పట్టించుకోలేదంటూ మళ్లీ సొంత పార్టీ నాయకులపై కామెంట్స్‌ చేశారు. పీసీసీ, సీఎల్పీపై కూడా విమర్శలు గుప్పించారు.

Exit mobile version