తెలంగాణలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మండి పడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందని, దానికితోడు మళ్ళీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రయాణికుల నడ్డి విరుస్తోందని మండి పడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ పెంచితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఎలా అని ప్రశ్నించారు ఆమె. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు మహిళా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఆమె కూడా బస్‌భవన్ ముందు నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. కాగా.. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా సంతోషమే.. చెప్పి చేరితే ఇంకా సంతోషమని సునీతారావు ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ ప్రజలకు మరోమారు షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్దమైంది. ప్రయాణీకులపై మళ్లీ భారం మోపేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్, డీజిల్ సెస్, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ అంటూ దాదాపు 35 శాతం వరకు టీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే సామాన్యుల, విధ్యార్థులు ఈభారాన్ని మోపలేని స్థితిలో నెట్టుకొస్తున్నా అయినప్పటికీ టీఎస్ ఆర్టీసీ నష్టం వస్తుందని మరోసారి టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమమయ్యింది. సగటున 20 నుంచి 30 శాతం వరకు పెంచుకునేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. త్వరలోనే దీనికి ఆమోదం వస్తుందని, అమలు చేసేందుకు సిద్దంగా వున్నట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే..
