తెలంగాణలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మండి పడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందని, దానికితోడు మళ్ళీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రయాణికుల నడ్డి విరుస్తోందని మండి పడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ పెంచితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎవరికి ఇష్టమొచ్చినట్టు…