Site icon NTV Telugu

Telangana Congress: కాంగ్రెస్‌ లో చెలరేగిన చిచ్చు.. రేపు సీనియర్ల భేటీపై ఉత్కంఠ

Telangana Congress

Telangana Congress

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. టీపీసీసీ కమిటీల ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చీలిక అనేక మలుపులు తిరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీనియర్లు ఒక్కటయ్యారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నివాసంలో సమావేశమైన సీనియర్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ.. వలస నేతలతో పాటు అసలు కాంగ్రెస్‌ వాళ్లకు కూడా అన్యాయం జరుగుతుందనే ఉమ్మడి స్వరం వినిపించింది. అసలు కాంగ్రెస్ వాళ్లదేనన్నారు. పార్టీని కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. మరోవైపు ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ సమావేశానికి భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేతలు హాజరుకాలేదు.

Read also: CM YS Jagan: రేపు ప్రకాశం జిల్లాకు సీఎం జగన్‌

సీనియర్ నేతల వ్యాఖ్యలపై రేవంత్ వర్గం నేతలు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేపథ్యానికి చెందిన 12 మంది నేతలు పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. తాము పదవుల కోసం ఆశపడటం లేదని, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్‌లో చేరి నాలుగేళ్లు అయిందని సీనియర్‌ నేతలకు కౌంటర్‌ ఇచ్చారు. ఈ పరిణామాలను తెలంగాణ ఇన్‌ఛార్జ్ కార్యదర్శులు కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదించారు.ఈ క్రమంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ నిశితంగా పరిశీలించనుంది. అసంతృప్త నేతలతో సమావేశం కావాలని ఇంచార్జి కార్యదర్శులకు హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న నదీమ్ జావిద్ ఇప్పటికే కొందరు సీనియర్ నేతలకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

Read also: Taliban Militants: తాలిబన్ల అరాచకం.. పోలీస్ స్టేషన్‌ని నిర్మింధించి..

కానీ సీనియర్ నేతలు మాత్రం పట్టు వదలడం లేదు. పార్టీలో సమస్యలుంటే ఢిల్లీకి వచ్చి చెప్పాలని సీనియర్లకు హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది.అలాగే సమస్యలుంటే మీడియా ముందు మాట్లాడవద్దని చెప్పారు. రేపు (మంగళవారం) మరోసారి సమావేశం కావాలని సీనియర్లు నిర్ణయించారు. రేపు సాయంత్రం 4 గంటలకు మహేశ్వర్ రెడ్డి నివాసంలో సమావేశం కావాలని నిర్ణయించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదించాల్సిన అంశాల ఎజెండాను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే భట్టి విక్రమార్క నివాసానికి తరలివచ్చిన నేతలతో పాటు మరికొందరు సీనియర్ నేతలను కూడా ఈ సమావేశంలో పాల్గొనేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఈ భేటీ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Mallu Ravi: రేవంత్‌ పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు.. నోరుజారితే నాలుచీరేస్తామన్న మల్లురవి

Exit mobile version