NTV Telugu Site icon

BIG Breking: శంషాబాద్ ఎయిర్ పోర్టు.. విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం..

Indigo

Indigo

BIG Breking: హైదరబాద్‌ శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో విమాన ల్యాండింగ్‌ విషయంలో గందరగోళ పరస్థితి నెలకొంది. ఎయిర్‌ పోర్టులో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గమ్యం చేరుకున్నాము అనుకున్న ప్రయాణికులకు గట్టిగా షాక్‌ తగిలింది. క్షణాల్లో దిగే సమయంలో ఒక్కసారిగా విమానం టేకాఫ్‌ కావడంతో.. భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. కాసేపు తరువాత మళ్లీ పైలట్ విమానం సేఫ్ గా లాండింగ్ చేయడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read also: Rangareddy Crime: కామంతో మైనర్ పై అఘాయిత్యం.. 3 నెలల తరువాత బయటపడ్డ భాగోతం

వైజాగ్ నుండి హైదరాబాద్ కు బయలుదేరింది. అక్కడినుంచి సేఫ్‌ గానే బయలు దేరిన విమానానికి ఏం జరిగిందో తెలియదు కానీ పైలెట్‌ విమానం రన్ వే పై ల్యాండ్ అవుతూనే క్షణాల్లో మళ్ళీ టేకాఫ్ తీసుకున్నాడు. ఫ్లైట్ రన్ వైఫై దిగకుండా టేక్ ఆఫ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కాసేపు ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. పైలెట్‌ ఎందుకు మళ్లీ టేక్‌ఆప్‌ చేశాడనేది వారికి కాసేపు గుండె ఆగినట్లు అయ్యింది. ఏదైనా ప్రమాదంలో ఉన్నామా? అనే ప్రశ్నలు కదులుతున్న సమయంలో మళ్లీ ఐదు నిమిషాల తర్వాత విమానం సేఫ్ గా లాండింగ్ చేశాడు పైలట్. ఫ్లైట్ సేఫ్ గా లాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ సమయంలో రన్ వే పై విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతోనే ఇబ్బంది ఎదురైందని ప్రయాణికులకు క్లారీటీ ఇచ్చారు. ఎవరికి ఏమీ ప్రాణహానీ జరగలేదని వెల్లడించారు. విజిబిలిటీ సరిగా లేనందువల్లనే ఇలా జరిగిందని తెలిపారు.
Kishan Reddy: 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానం

Show comments