NTV Telugu Site icon

Telangana Govt: తెలుగు పాఠ్య పుస్తకాలపై గందరగోళం.. సీఎంగా కేసీఆర్ పేరు..

Telangana Books

Telangana Books

Telangana Govt: ఒకటి నుండి 10 వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాన్ని, వర్క్ బుక్ లను విద్యార్థుల నుండి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న స్కూళ్లు రీఓపెన్ కావడంతో.. విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ముందు మాటను మార్చకుండా విద్యాశాఖ ప్రింట్ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందు మాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రా రెడ్డిల పేర్లు 2015లో విద్యాశాఖలో ఉన్న అధికారుల పేర్లు ప్రింట్ చేశారు.

Read also: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

దీంతో ముందు మాట చాప్టర్ వివాదం కావడంతో ఆ పుస్తకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశం చేసింది. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు కాకుండా మాజీ సీఎం పేరును పుస్తకాల్లో ప్రస్తావించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి పేరు కాకుండా పాఠ్యపుస్తాకాలు ఎలా ముద్రిస్తారని సీరియస్ అయ్యారు. పిల్లలకు తప్పుదోవ పట్టించుటకే ఇలాంటివి చేస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ఈ తప్పిదం ఎవరి వల్ల అయ్యిందనేది దర్యాప్తు చేస్తామని తెలిపారు. తొందరలోనే కొత్త పాఠ్య పుస్తకాలు ప్రింట్ చేసి పిల్లలకు పంచడం జరుగుతుందని అన్నారు.

Read also: CM Chandrababu: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

నారాయణ పేట జిల్లా విద్యార్దుల పాఠ్యపుస్తకాల పంపిణీలో గందరగోళం జరిగిందని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సిఎం కేసిఆర్, గత మంత్రులు, అధికారుల పేర్లు ఉండటం గుర్తించి విద్యాశాఖ అధికారులపై ఎమ్మెల్యే శ్రీహరి మండిపడ్డారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీహారి ఫిర్యాదుతో పాఠశాల విద్యాశాఖ స్పందించింది. పాఠ్యపుస్తకాలని, వర్క్ బుక్స్ ను వెనక్కు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే కొత్త పాఠ్యపుస్తకాలు అందిస్తామని తెలిపింది.
Wife and Husband: నా భార్య అలిగి వెళ్లిపోయింది.. కరెంట్ స్తంభం ఎక్కిన భర్త