Site icon NTV Telugu

Congress: అగ్గి రాజేసిన ఫేస్‌బుక్‌ పోస్ట్.. మహిళా కాంగ్రెస్ సమావేశంలో రచ్చ..

Women Congress

Women Congress

కాంగ్రెస్‌ మహిళా నేతల మధ్య ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చిచ్చు పెట్టింది.. ఓవైపు ఇందిరా భవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులతో రాష్ట్ర వ్యవహారల ఇంఛార్జ్‌ ఠాగూర్‌ సమావేశం నిర్వహిస్తుండగా.. మరోవైపు మహిళా కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది.. రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావును సిటీ అధ్యక్షురాలు కవిత అసభ్య పదజాలంలో దూషించారు.. సునీతా రావును దూషిస్తూ సమావేశం నుండి వెళ్లిపోయారు కవిత.

Read Also: Nizamabad: హనుమాన్ శోభాయాత్రలో బయటపడ్డ బీజేపీ వర్గపోరు..

మహిళా కాంగ్రెస్‌ నేతల సమావేశంలో.. హైదరాబాద్ సిటీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవిత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితారావు మధ్య వాగ్వాదం.. జరిగింది.. దీనికి కారణం.. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఓ పోటాగా చెబుతున్నారు.. సిద్దిపేట, జోగులాంబ జిల్లాల మహిళా అధ్యక్షురాలు నిలబడి ఉండగా.. సిటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత కూర్చుని ఉన్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో షేర్ కావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సిద్దిపేట, జోగులాంబ జిల్లా మహిళా అధ్యక్షులు.. దీంతో.. సిటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు తన ఫేస్ బుక్‌లో ఉన్న ఫోటోలు తొలగించి.. మిగతా నేతలకు సారీ చెప్పాలని కవితకు చెప్పారు సునీతా రావు.. అయితే, మిగతా మహిళా నేతలందరిని అసభ్యంగా దూషిస్తూ సమావేశం నుండి వెళ్లిపోయారు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత.. కాంగ్రెస్‌లో ఇలాంటి ఘటనలు సాధారణ వ్యవహారమే అయితే.. ఓవైపు సీనియర్లతో భేటీ జరుగుతోన్న సమయంలో.. ఈ పరిణామం చర్చగా మారింది.

Exit mobile version