Conductor Saved Woman: ఓ కండెక్టర్ తన తెలివి ఉపయోగించి ఓ యువతి ప్రాణాలు కాపాడాడు. ఆయువతి ఆత్మహత్యకు పాల్పడుతుందని తెలుసుకున్న అతను.. పైఅధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆమె ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. యువతి ప్రాణాలు కాపాడిన నారాయణ ఖేడ్ డిపో బస్ కండక్టర్ ను సభాష్ అంటూ ప్రశంసించారు అధికారులు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Tata Punch EV: ఇక టాటా పంచ్ వంతు.. ఈవీగా రాబోతున్న పంచ్…
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఓయువతి బస్ ఎక్కింది అనంతరం ఆమె JBS బస్టాండ్ లో బస్సు దిగింది. అయితే ఆయువతి తన వద్ద వున్న పర్సును బస్సులోనే మరిచిపోయింది. అయితే కండెక్టర్ పర్సు కింద పడి ఉండటాన్ని గమనించాడు. పర్సును ఓపెన్ చేసిన కండక్టర్ రవి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆపర్సులో 403 రూపాయలతో పాటు సూసైడ్ నోట్ చూసిన కండక్టర్ రవికి మైండ్ బ్లాంక్ అయ్యింది. వెంటనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి ట్విట్టర్ ద్వారా దృష్టికి తీసుకెళ్లాడు. యువతి ఫోటో, సూసైడ్ నోట్, ఆధార్ కార్డు ని సజ్జనార్ కి కండెక్టర్ రవి పంపించాడు. ఎండీ సజ్జనార్ ట్విటర్ చూసిన వెంటనే యువతిని పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read also: MLAs Poaching Case: చంచల్ గూడా జైలుకు ఈడీ.. నందకుమార్ ను విచారించనున్న సుమిత్ గోయల్ టీమ్
దీంతో ఆర్టీసీ ఎస్సై దయానంద్, మారేడ్ పల్లి సహాయంతో యువతిని వెతికే పనిలోపడ్డారు. కొద్ది గంటల్లోనే ఆయువతి జాడ కనిపెట్టారు. దీంతో అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయువతిని పోలీసుల సహాచంతో నచ్చజెప్పి యువతి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువతి ప్రణాలను కాపాడిన కండక్టర్ రవిని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్ అభినందించారు. వెంటనే స్పందించి ఓ యువతి ప్రాణాలు కాపాడినందుకు ప్రశంసలు జల్లులు కురిపించారు. ఆపర్సులో ఏముంటే ఏమైంది అనుకునే వాళ్లు ఉంటారని, తను విధిలో ఉండికూడా చాకచక్యంగా తమ తెలివితో ఓ యువతిని కాపాడినందుకు ప్రశంసలు అందుకున్నారు.
Today (26-12-22) Business Headlines: ఇండియా.. ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’. మరిన్ని ముఖ్య వార్తలు.