Site icon NTV Telugu

Rahul Gandhi Tour: రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు..

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది రామారావు హెచ్‌ఆర్సీలో ఈ ఫిర్యాదు చేశారు.. కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోందని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా వారి వ్యవహారం ఉందంటూ హెచ్ఆర్సీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: Rahul Gandhi in Pub: సాయిరెడ్డికి ఠాగూర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌..

కాగా, తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన రాహుల్‌ గాంధీ.. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.. ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థుల‌తో ఆయన ముఖాముఖి చేపట్టాలనుకున్నారు. అయితే, ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ అందుకు అనుమతులు నిరాకరించింది. మరోవైపు, రాహుల్‌ పర్యటనపై రాజకీయ రచ్చ కూడా సాగుతోంది.. దీంతో, ఓయూలో ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్‌ గాంధీ ఓయూ సందర్శనను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్వీ నాయకులు ఆందోళనకు దిగారు.. ఎన్ఎస్‌యూఐ నేతలు కొందరు కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేయడంతో.. కౌంటర్‌గా రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. దీంతో, ఓయూలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్‌ పుట్టిస్తున్నాయి.

Exit mobile version