NTV Telugu Site icon

Communal Harmony: మహిళ అంతిమయాత్రలో ముస్లిం యువత

Muslim1

Muslim1

మనది లౌకిక రాజ్యం. మనదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో జీవన విధానాలు. హిందువుల పండుగల్లో ముస్లింలు, రంజాన్ ఇఫ్తార్ విందుల్లో అన్ని మతాల వారు పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకుంటూ వుంటారు. వినాయకచవితి వేడుకల్లో ముస్లింలు పాల్గొంటూ వుంటారు. అలాగే హిందూ మతానికి చెందినవారు మరణిస్తే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తూ వుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు కొందరు ముస్లిం యువకులు. అనారోగ్యంతో ఓ మహిళ మృతి చెందగా ఆమె అంతిమ యాత్ర లో పాల్గొని దహన సంస్కారాలు చేపట్టారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామానికి చెందిన ఈలప్రోలు కనకదుర్గ (43) అనారోగ్యంతో మృతి చెందింది. కనక దుర్గ కుటుంబం స్థానికంగా ఉంటున్న ముస్లిం కుటుంబాలతో కలసిమెలసి ఉంటారు.. దీంతో ఆమె అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో కలిసి చివరివరకు పాల్గొన్నారు ముస్లిం యువకులు. మతసామరస్యానికి ఆదర్శంగా నిలిచి కనకదుర్గ అంతిమ యాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులతో పాటు పాడె మోసి అంత్యక్రియలు నిర్వహించారు ముస్లిం యువకులు. కులమతాలకు అతీతంగా అంతిమ యాత్రలో పాల్గొన్న ముస్లిం సోదరులను పలువురు ప్రశంసించారు. మతం ఒక జీవనవిధానం మాత్రమే. మతం ఏదైనా మానవత్వం గొప్పదని, ఏ దేవుడిని కొలిచినా.. మానవసేవ ముఖ్యమని చాటిచెప్పారు. మనదేశ ఔన్నత్యాన్ని ఇలాంటి ఘటనలు మరోసారి చాటిచెబుతూ వుంటాయి.

Sarkaru Vaari Paata: మహేష్ సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారంటే..?