NTV Telugu Site icon

Online Gaming Fraud: ఆన్‌లైన్‌ గేమ్స్‌ లో రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరకు ఆత్మహత్య..

Online Games

Online Games

Online Gaming Fraud: ఎవరైనా నిజమైన ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ డబ్బు సంపాదించారా? అవుననే సమాధానం ఎవరి నుంచి రాదు. ఎందుకంటే ఆన్ లైన్ గేమ్స్ అంతా ఒక భూటకమనే చెప్పాలి. అది ఒక స్కాం. అమాయకులు వలపన్ని వారి దగ్గరనుంచి డబ్బులు లాగేసుకునే ఒక భూతం. అలాంటి గేమ్స్ కు అలవాటుపడి లక్షలు, కోట్లు పెట్టి బానిసై ఆడుతుంటారు. కానీ చివరకు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఆకర్షణీయమైన ఆఫర్‌లు, ప్రకటనల ద్వారా మోసపోతూ నిండుజీవితాలను బలితీసుకుంటున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

Read also: Committee Kurrollu: డబ్బుకి ఓటు అమ్ముకొనే గొర్రెలకు అంకితం..!

గంగాధరలోని మధురానగర్‌కు చెందిన నాగుల లక్ష్మణ్‌, లక్ష్మి దంపతుల కుమారుడు పృథ్వీ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరాడు. యూపీలోని నోయిడా వెళ్లాలని కంపెనీ చెప్పడంతో 2 నెలల కిందటే అక్కడికి వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ లో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు అతడికి ఆన్ లైన్ బెట్టింగ్ కు పరిచయం చేశారు. ఇందుకోసం పృథ్వీ రూ. వివిధ కారణాలను చూపుతూ స్నేహితులు, బంధువులు, సన్నిహితుల నుంచి రూ.12 లక్షలు. అయితే నాలుగు రోజుల్లోనే డబ్బులన్నీ మాయమయ్యాయి. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. 15 రోజులుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పులు ఎలా తీర్చాలా అని ఎప్పుడూ బాధపడేవాడు. తీవ్ర మనస్తాపానికి గురై గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు.
Sreeleela : మరో భారీ ఆఫర్ అందుకున్న శ్రీ లీల..?