NTV Telugu Site icon

Revanth Reddy: కేసీఆర్ గంజాయి మొక్కలు నాటారు.. వాటిని పీకి పడేస్తా..

Revanth Reddy Cm

Revanth Reddy Cm

Revanth Reddy: కేసీఆర్ గంజాయి మొక్కలు నాటారు.. వాటిని పీకి పడేస్తా.. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కార్పోరేషన్ లకు ముందు డబ్బులు ఇవ్వండి.. తర్వాత జీరో బిల్లు అవ్వండి అని మాకు నోటీసు ఇచ్చారని గుర్తు చేశారు. ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన నువెం పన్నీరు కాదంటూ హరీష్ రావుకు చురకలంటించారు. నువ్వు కూడా ఎక్కువ రోజులు ఆ సీటులో ఉండవు అంటూ హెచ్చరించారు. అన్ని గంజాయి మొక్కలు పీకి పడేస్తా అన్నారు. ఫార్మ్ హౌస్ లో ఉండి ఆదేశాలు జారీ చేస్తే అమలు చేస్తున్నాడని మండిపడ్డారు. అన్నిటినీ సెట్ చేస్తా అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల అంతా గ్రేటర్ పరిధిలోకి.. మాకు ప్రపంచం తోనే పోటీ అన్నారు రేవంత్ రెడ్డి. లక్ష కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు.. బిల్లులు మీ తాత కడతాడా? అని ప్రశ్నించారు. అప్పులు మేము చెప్తే.. ఆస్తులు వాళ్ళు చెప్పారని అన్నారు. మరి బకాయిలు ఎవడు కట్టాలి.. అవెందుకు చెప్పరు? అని ప్రశ్నించారు.

ఏడాది లో 70 వేల కోట్లు అప్పులకే చెల్లించాలని క్లారిటీ ఇచ్చారు. 60 వేల కోట్లు జీతాలు..పెన్షన్లు ..సర్కారు నడవడానికి అవుతుందన్నారు. 11 వేళా కోట్లు ఒకటో తేదీ అవసరమని చెప్పారు. కేంద్రం.. గవర్నర్ తో మంచి విధానంతో ఉంటున్నామని, ప్రజలకు ఉపయోగ పడేదే మా విధానం అన్నారు. కారు షెడ్డుకు పోయింది.. కేసీఆర్ ఇంటికి పోయిండంటూ వ్యంగాస్త్రం వేశారు. సామాజిక న్యాయం కి వేదిక కాంగ్రెస్ అన్నారు. గత కేబినెట్ ని మా కేబినెట్ చూడండి అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాథమిక ఆలోచన మా సామాజిక న్యాయం, సలహాదారు.. విప్.. లలో కూడా సామాజిక సమతుల్యం పాటిస్తున్నామని తెలిపారు. మా నిర్ణయాల్లో లోపం లేదని అన్నారు. వందల కోట్లు కాదు.. వేళా కోట్ల అవినీతి చేశారు బీఆర్ఎస్ వాళ్ళు.. విచారణకు ఆదేశాలు ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగ బద్దంగా విచారణ చేస్తారన్నారు. పారదర్శక విచారణ ఉంటదని చెప్పారు.

అమ్మగారు లేరు.. బతుకమ్మ ఎవరు ఆడతారు అనుకోకండి.. బంతి పూలతో.. బతుకమ్మ ఉండేది.. అమ్మగారూ ప్లాస్టిక్ పూలతో ఆడారు.. వచ్చే బతుకమ్మలో.. ప్లాస్టిక్ పూలు ఉండకపోవచ్చని అన్నారు. కొందరు బీఆర్ఎస్ వాళ్ళు.. కరెంట్ బంధు చేయించే పనిలో ఉన్నరు.. అక్కడక్కడ పిచ్చోళ్ళ ఉంటారన్నారు. అలా కరెంట్ కట్ చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు తీసేశాం.. కొంత సెట్ అయ్యిందన్నారు. అక్కడక్కడ ఇంకా గంజాయి మొక్కలు ఉన్నాయి.. విద్యుత్ శాఖలో ఉన్నారు.. సెటిల్ చేస్తాం వాళ్ళను కూడా అంటూ రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ధరణి పై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తామని తెలిపారు. ధరణి రాకముందు భూములు ఎవరివి.. తర్వాత ఏం జరిగింది అనేది బయటకు తీస్తామన్నారు. మేము చేరికల గురించి ఆలోచన చెయ్యలేదు, కానీ బీఆర్ఎస్- బీజేపీ వాళ్ళు మా సర్కార్ ని కులుస్తాం అంటున్నారని క్లారిటీ ఇచ్చారు. కడియం.. డాక్టర్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా అంటున్నారని తెలిపారు. వాళ్ళు పడగొడితే.. చూస్తూ ఊరుకుంటామా? అని మండిపడ్డారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు.
IPL 2024: టీ20 ప్రపంచకప్‌ 2024కు ఐపీఎల్‌ ప్రదర్శనే కీలకం కాదు!