NTV Telugu Site icon

Nampally Exhibition: నేటి నుంచి నుమాయిష్‌.. ప్రారంభించనున్న సీఎం రేవంత్

Nampalli Eximotion

Nampalli Eximotion

Nampally Exhibition:నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 1న సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కొనసాగుతున్న ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు కొనసాగుతుంది. సోమవారం నుంచి ఈ ఏడాది ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అమ్యూజ్‌మెంట్‌ పార్కులో దాదాపు 2400 స్టాల్స్‌, ఫుడ్‌ కోర్టులు, వివిధ పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. నుమాయిష్ సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమై నుమాయిష్ విజయవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది, మెట్రో రైలు సమయాలను పొడిగించనున్నారు.

Read also: Drinking Water: హైదరాబాద్ ప్రజలు అలర్ట్.. 3,4వ తేదీల్లో నీటి సరఫరా బంద్‌..

మరోవైపు నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సిద్దంబర్‌బజార్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ జిల్లా బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాలను మొహింజా మార్కెట్ వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు. బషీర్ బాగ్, కంట్రోల్ రూమ్ నుంచి నాంపల్లి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద బీజేఆర్ విగ్రహం, అబిడ్స్ వైపు మళ్లిస్తారు. బేగంబజార్, ఛత్రి నుంచి మాలకుంట వైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద దారుస్సలాం, ఎక్మినార్ వైపు మళ్లిస్తారు. దారుస్సలాం నుంచి అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లే వాహనాలను అలస్కా జంక్షన్ నుంచి బేగంబజార్, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. ముసబౌలి, బహుదూర్‌పురా నుంచి నాంపల్లి వెళ్లే వాహనాలను సిటీ కాలేజీ వద్ద నయాపూల్, ఎంజేమార్కెట్ మార్గంలో మళ్లిస్తారు. ప్రజలు సహకరించాలని, ప్రత్యామ్నాయ దారులతో వెళ్ళాలని సూచించారు.
Vidadala Rajini: టీడీపీ గుండాలు ఈ దాడి చేశారు.. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు!