CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వీడియో సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో సందేశం ఇచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు అన్నారు. ఇవి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎదిగారన్నారు. రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోందని మండిపడ్డారు.
Read also: Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్..
Also Read
బీజేపీ వాళ్ళకి ఒకటే పిచ్చి పట్టుకున్నదన్నారు. మనకి పిచ్చి లేపి కత్తులతో పొడుచుకునేటట్టు చేస్తున్నారన్నారు. గాడిద గుడ్డు ఇచ్చిన బిజెపికి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. బీజేపీ మాయలో పడితే, వాళ్ళు అధికారంలో వస్తే రాజ్యాంగం మారుస్తారన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు తీసేస్తారన్నారు. సీఎం కార్యాలయంలో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిది అన్నారు. నీలం మధుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించిందన్నారు. నీలం మధుకి పటాన్ చెరు నుంచి 50 వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాలని తెలిపారు. నీలం మధు, కాట శ్రీనివాస్ జోడెద్దులు, రామలక్ష్మణుల్లా పని చేయండన్నారు.
Read also: D. Sridhar Babu: పేదవారికి అన్యాయం జరిగితే సహించేది లేదు..
దేశం సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని తెలిపారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్రతో జరుగుతున్నాయని తెలిపారు. అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని బిజెపి రద్దు చేయాలని కుట్రలు చేస్తుందన్నారు. మన మధ్య గొడవలు పెట్టి లాభపడాలని బీజేపీ చూస్తుందని తెలిపారు. ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యాక ఇక్కడ అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. ఈ పటాన్ చెరు మినీ ఇండియా… దేశంలో ఎన్ని భాషలు, కులాలు ఉన్నాయో అందరూ ఇక్కడే కలిసి మెలిసి ఉన్నారన్నారు. చట్ట సభల్లో మాట్లాడలన్న, ఢిల్లీలో మన సమస్యలపై మాట్లాడలన్న నీలం మధు గెలవాలన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేసిందో, 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందన్నారు.
Revanth Reddy: సీఎంవోలో పెత్తనం జగ్గారెడ్డిది.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నా..
తాజావార్తలు
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?