NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు తుక్కుగూడకు సీఎం.. సభ ప్రాంగణం పరిశీలన

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ‘జనజాతర’ సభను నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. కాగా.. నేడు తుక్కుగూడకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈనెల 6న రాజీవ్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు.

Read also: Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. గట్టిగా చప్పట్లు కొట్టండి: సంజయ్ మంజ్రేకర్

ఇక తుక్కుగుడా బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ తదితర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ క్రమంలో జనసమీకరణ నిర్వహించాలని తెలంగాణ పీసీసీ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభకు కనీసం పది లక్షల మందిని సమీకరించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కాగా.. టీ-పీసీసీ ఇప్పటికే అన్ని పార్లమెంట్‌ల మంత్రులు, ముఖ్య నేతలకు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగించింది. పార్లమెంట్ ఇన్‌చార్జ్ నేతలంతా తమ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించాలని టీ-పీసీసీ ఆదేశించింది.

Read also: Alia Bhatt : అలియాభట్ మెడలో మెరిస్తున్న ఈ నెక్లేస్ ధర తెలిస్తే షాక్ అవుతారు..

ఈసందర్భంగా.. తుక్కుగూడలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడ సభ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తుక్కుగుడలోని రాజీవ్ గాంధీ సభ ప్రాంగణాన్ని పరిశీలించనున్నారు. ఈ నెల 6వ తేదీన జాతీయ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమం తుక్కుగూడలో జరగనున్నందున.. కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ 5 హామీలను ప్రకటిస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన రేవంత్ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Read also: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..షాకిస్తున్న వెండి ధరలు..

ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పదవులకు నామినేషన్ల సమయంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన నాయకులకే ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఏఐసీసీ మెచ్చుకోవడం టీపీసీసీకి గర్వకారణమైన ఉద్యమమని అన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు మద్దతుగా ఉన్నందున లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Mahua Moitra: కావాలనే లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు.. మళ్లీ విజయం నాదే!