CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయగాథలపై ఆయన హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీ నేతలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్‌తో భేటీ అయ్యేందుకు సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు కుల గణన అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఈ అంశాలపై నెల రోజుల క్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్ వాయిదా వేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబసభ్యులు నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.
IPL Auction 2025: మొదటి రోజు అమ్ముడైన ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
- ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..
- నేడు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు..
![Cm Revanth Reddy](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/11/CM-Revanth-Reddy-3-1024x576.jpg)
Cm Revanth Reddy