Site icon NTV Telugu

CM Revanth Reddy: హైకమాండ్ నుంచి పిలుపు.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం జాతీయ స్థాయిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపికపై… తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఈరోజు ఢిల్లీ వెళ్లి పార్టీ అభ్యర్థులపై చర్చించి తిరిగి హైదరాబాద్ రానున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన పార్టీలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read also: Viral: ప్రెజర్ కుక్కర్‌ ను ఇలా కూడా వాడేస్తున్నారా..?!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఈనెలలో ఇది రెండో సారి. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) భేటీ ఉన్న నేపథ్యంలో రేవంత్‌ ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే.. ఆయన, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత మూడునెలల్లో ఢిల్లీకి వెళ్లడం ఇది 11వ సారి కావడం విశేషం. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారెవ్వరూ ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన చరిత్రలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికి ఒకటిరెండు సార్లు రేవంత్‌ ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఇక, మిగిలిన పర్యటనలన్నీ ప్రధానంగా పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకేనని తెలుస్తున్నది. అయితే.. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ భేటీ జరగనున్నది. దీనికి రేవంత్‌తోపాటు మంత్రి ఉత్తమ్‌ కూడా హాజరవుతున్నారు.
Medak Crime: ఇష్టం లేకున్నా చిన్న వయసులో పెళ్లి చేశారని చిన్నారి ఆత్మహత్య

Exit mobile version