NTV Telugu Site icon

CM Revanth Reddy: నేటితో కాంగ్రెస్‌ పాలనకు నెల రోజులు.. స్పెషల్ ట్వీట్ చేసిన సీఎం రేవంత్

Revanthreddy Cm

Revanthreddy Cm

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెలరోజులు పూర్తి చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో డిసెంబర్ 7న రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పాలన నేటితో ఒక నెల పూర్తయింది. ఈ నేపథ్యంలో రేవంత్ తన నెలరోజుల పాలనను గుర్తు చేస్తూ ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈ 30 రోజుల పాలన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని కాంగ్రెస్‌ నేటితో నెల రోజు పాలపై సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు.

Read also: Komuravelli Mallanna: వైభవంగా మల్లన్న కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని తెలిపారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందన్నారు. రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా అని ట్విటర్‌ వేదికగా స్పందించారు.

Read also: Jabardasth Avinash: బిడ్డని కోల్పోయిన అవినాష్… తల్లి గర్భంలోనే మరణించిన శిశువు

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు గత నెల 3న వెలువడగా, కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. రెండుసార్లు అధికారాన్ని కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత తనదైన బ్రాండ్ పాలనతో ముందుకు సాగుతున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని అమలు చేశారన్నారు. ఇతర హామీల అమలు కోసం ప్రజాపరిపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అర్హులందరికీ త్వరలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

TGO Mamatha Transfer: టీజీవో అధ్యక్షురాలు మమతపై బదిలీ వేటు..!

Show comments