Site icon NTV Telugu

CM Revanth Reddy: తెలంగాణకు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు.. రేవంత్‌ రెడ్డి ట్విట్‌ వైరల్‌

Revanth Reddy Cm

Revanth Reddy Cm

CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని సమస్యలపై డిమాండ్లు పరిష్కరించాలని కోరితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు ఇటీవల గాంధీభవన్ వద్ద ప్రదర్శన నిర్వహించిన విషయం సంగతి తెలిసిందే. ఇప్పుడు మేడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

Read also: Kishan Reddy: బీజేపీని చూసి కాంగ్రెస్ కాళ్ల కింద కుర్చీ కదులుతుంది..

* తెలంగాణ అడిగింది… పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా బీజేపీ ఇచ్చింది… “గాడిద గుడ్డు”

* తెలంగాణ అడిగింది… రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. బీజేపీ ఇచ్చింది… “గాడిద గుడ్డు”

* తెలంగాణ అడిగింది… బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. బీజేపీ ఇచ్చింది… “గాడిద గుడ్డు”

* తెలంగాణ అడిగింది… కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం.. బీజేపీ ఇచ్చింది… “గాడిద గుడ్డు”

* తెలంగాణ అడిగింది… మేడారం జాతరకు జాతీయహోదా.. బీజేపీ ఇచ్చింది… “గాడిద గుడ్డు”

* తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు… పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద “గాడిద గుడ్డు”.

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఒక్కటే అడ్డంకి అని సీఎం రేవంత్ రెడ్డి సెటైరికల్ గా ట్వీట్ చేశారు. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది ఇది అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన తలపై ఒక బాక్స్ పెట్టుకుని దానిపై గాడిద గుడ్డు అంటూ అని రాసిన ఫోటోతో ట్వీట్ వైరల్ గా మారింది.

Read also: Pemmasani: పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది..

Exit mobile version