CM Revanth Reddy: మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వేసవి ప్రారంభం కావడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై ఆయన సమీక్షించనున్నారని తెలుస్తోంది.గ్రామాల్లో నీటి సరఫరాపై ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుంచి సమాచారం సేకరిస్తోంది. గతంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఉండగా ఇటీవల ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించింది. ఈ మేరకు ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది.
Read also:Fire Accident: సిద్దిపేట సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం.. నిలిచిన విద్యుత్ సరఫరా
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు భగీరద అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు నేరుగా సీఎంఓకే చేరడంతో ప్రభుత్వం ఈ ఫిర్యాదులపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పైపులైన్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణం విలువ 7000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సీఎంఓకు ఫిర్యాదులు వెళ్లాయి. దాదాపు రూ.7 వేల కోట్ల అవినీతి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భగీరథ అవినీతిపై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విచారణకు సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
Read also: Arvind Kejriwal: పెరిగిన నీటి బిల్లులపై అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చిన ఢిల్లీ సీఎం..
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.30 వేల కోట్ల మేరకు రుణాలు తీసుకున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతి గ్రామానికి కొత్త పైపులైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికీ నీటి కనెక్షన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి 90 శాతానికి పైగా గ్రామాలకు తాగునీటి సౌకర్యం ఉండేది. ఇక్కడ పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాలకు కొత్త పైపులైన్లు వేయకుండానే కాంట్రాక్టు సంస్థ బిల్లుల చెల్లింపులు జరిగాయని ఆరోపణలున్నాయి. మెటీరియల్ కొనుగోలు చేయకుండానే కోట్లాది రూపాయల బిల్లులు సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంటింటికీ ఓవర్ హెడ్ ట్యాంకులు, నల్లా కనెక్షన్లు ఉన్నాయని ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు వీటిపై విజిలెన్స్ విచారణ చేపట్టిందని అంటున్నారు.
Maharastra : నేటి నుంచి సమ్మెకు దిగనున్న 8000మంది డాక్టర్లు.. నిలిచిపోనున్న వైద్య సేవలు