Site icon NTV Telugu

CM Revanth: ప్రధానికి రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి.. దేశం కోసం ‘ఏఐ కౌన్సిల్’ కావాలి..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth at AI Summit:కృత్రిమ మేధ (AI) అనేది మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆవిష్కరణ అని, అది మనిషి మేధోశక్తిని సైతం దాటి ఆలోచించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన, ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో మన జీవితాలను, ముఖ్యంగా వ్యవసాయం వంటి కీలక రంగాలను అనూహ్యంగా మార్చబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏఐ వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి , ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఆయన పలు విప్లవాత్మక సూచనలు చేశారు.

దేశంలో ఏఐ రంగాన్ని బలోపేతం చేసేందుకు నీతి అయోగ్ లేదా జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఒక ‘నేషనల్ ఏఐ కౌన్సిల్’ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర , రాష్ట్ర స్థాయిల్లో ఈ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి సారించడానికి వీలుగా ప్రత్యేకంగా ‘ఏఐ మంత్రిత్వ శాఖ’ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఏఐ అనేది చేయలేనిదంటూ ఏదీ లేదని, ప్రస్తుతం రోబోటిక్స్ వంటి రంగాల్లో ఇది అద్భుతాలు సృష్టిస్తోందని పేర్కొంటూ, దీనిపై జాతీయ స్థాయిలో ఒక స్పష్టమైన విధానం ఉండాలని కోరారు.

Brian Bennett: టీ20 వరల్డ్‌కప్‌లో ఔట్‌ కాని బ్యాటర్ బెన్నెట్.. మూడు ఇన్నింగ్స్‌లలో 175 రన్స్!

తెలంగాణ ఇప్పటికే ఏఐ స్టార్టప్స్ విషయంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని వెల్లడించిన రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటే దేశం కోసం ఒక భారీ ‘ఏఐ వార్ రూమ్’ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. భారతీయులు గూగుల్, ట్విట్టర్, వాట్సాప్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ, మన సొంతంగా అలాంటి దిగ్గజ సంస్థలను సృష్టించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదగడం ద్వారా ఆ లోటును భర్తీ చేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పిన సీఎం, అంతర్జాతీయ సంస్థలు చర్చలకు , ఒప్పందాలకు తమ రాష్ట్రానికి రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఏఐ సమ్మిట్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, భవిష్యత్తులో ఏఐ అనేది కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాకుండా, మనిషికి మించిన తెలివితేటలతో సామాన్యుడి జీవన ప్రమాణాలను పెంచే సాధనంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

Eating Slate Pencil (Balapalu): రుచిగా ఉన్నాయని ‘బలపాలు’ తింటున్నారా? ఈ జబ్బులు మీవెంటే!

Exit mobile version