CM Revanth Reddy : పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం జరిగిన భారీ పేలుడు ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల ధాటికి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం విచారం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Illegal relationships : దాంపత్య బంధానికి పెనుభూతులవుతున్న వివాహేతర సంబంధాలు.. కారణాలు ఇవేనా..!
ఈ సందర్భంగా ఆయన అధికారికంగా చేసిన ప్రకటనలో..”పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో పలువురు మరణించడం కలచివేసింది. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఆదేశాలు సంబంధిత అధికారులకు ఇచ్చాను. ప్రభుత్వంగా మేము బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం” అని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. పాశమైలారం ఘటనపై అధికారులు సంపూర్ణ నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, మరెందరో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉండగా, రెస్క్యూ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Indo-Pak Border: సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు లభ్యం.. మిస్టరీగా డెత్!
