CM Revanth Reddy: తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది. విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్యా,వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
Read also: Hyderabad: హాస్పిటల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి..
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడ గ్రామంలో గుండెలు పిండే విషాదం జరిగింది. తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిని విగత జీవిగా చూసిన ఆ కూతురుకి ఏం చేయాలో అర్థకాని పరిస్థితి నెలకొంది. స్థానికులకు ఈ వార్త తెలియడంతో మృత దేహాన్ని కిందికి దించారు. అయితే పూట గడవడమే కష్టంగా మారిని ఆ కుటుంబానికి అంత్యక్రియలకు కాసులు కరువయ్యాయి. ఆ కూతురు తల్లి మృతదేహం వద్ద ఎవరైనా సహాయం చేస్తారేమో అంటూ దీనంగా చూసింది. కానీ.. ఎవరూ తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వకపోవడంతో చివరకు తల్లికోసం కూతురు భిక్షాటన చేసింది. ఇంటి ముందు ఓ దుప్పటిని పరిచి అంత్యక్రియలకు సహాయం చేయాలను కోరుకుంటూ దీనస్థితిలో కూర్చున్న ఆ బాలికను చూసి.. అక్కడున్న వారందరికి కన్నీరు తెప్పించింది.
Hyderabad Rains: హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం..
