CM Revanth Reddy: తల్లి అంత్యక్రియలకు చిన్నారి భిక్షాటన.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
- తల్లి అంత్యక్రియలకు చిన్నారి భిక్షాటన పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు..
- బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు..
- బాలికకు అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్‌ను ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది. విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్యా,వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
Read also: Hyderabad: హాస్పిటల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి..
Also Read
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడ గ్రామంలో గుండెలు పిండే విషాదం జరిగింది. తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిని విగత జీవిగా చూసిన ఆ కూతురుకి ఏం చేయాలో అర్థకాని పరిస్థితి నెలకొంది. స్థానికులకు ఈ వార్త తెలియడంతో మృత దేహాన్ని కిందికి దించారు. అయితే పూట గడవడమే కష్టంగా మారిని ఆ కుటుంబానికి అంత్యక్రియలకు కాసులు కరువయ్యాయి. ఆ కూతురు తల్లి మృతదేహం వద్ద ఎవరైనా సహాయం చేస్తారేమో అంటూ దీనంగా చూసింది. కానీ.. ఎవరూ తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వకపోవడంతో చివరకు తల్లికోసం కూతురు భిక్షాటన చేసింది. ఇంటి ముందు ఓ దుప్పటిని పరిచి అంత్యక్రియలకు సహాయం చేయాలను కోరుకుంటూ దీనస్థితిలో కూర్చున్న ఆ బాలికను చూసి.. అక్కడున్న వారందరికి కన్నీరు తెప్పించింది.
Hyderabad Rains: హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం..
తాజావార్తలు
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!