NTV Telugu Site icon

Revanth Reddy: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. చర్చగా మారిన అంశం..!

Revanth Reddy Janareddy

Revanth Reddy Janareddy

Revanth Reddy: టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన ఇంటికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు. ఇరువురు నేతలు కాసేపు చర్చించుకున్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న జానా రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగార్జున సాగర్‌ టిక్కెట్‌ను ఆయన తనయుడు జై వీర్‌రెడ్డికి కేటాయించారు. ఆ స్థానం నుంచి జావీర్ విజయం సాధించారు. అయితే తాజాగా సీఎం జానారెడ్డిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Read also: YSR Law Nestham: వైఎస్సార్‌ లా నేస్తం నిధుల విడుదల.. బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్‌

ప్రస్తుతం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో 11 మందికి చోటు దక్కింది. మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతోంది. ముఖ్యమైన హోం శాఖతో పాటు ఎవరికీ కేటాయించని శాఖలు సీఎం వద్ద ఉన్నాయి. అయితే తాజా భేటీ నేపథ్యంలో జానా రెడ్డికి హోం శాఖ దక్కుతుందనే చర్చ మొదలైంది. ఈ విషయంపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి జానా రెడ్డి నివాసానికి వెళ్లినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే మంత్రి పదవులు దక్కాయి. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఉన్నారు. కానీ జానా రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే జిల్లాకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినట్లే. ఈ విషయంలో మిగిలిన జిల్లా నేతల నుంచి కొంత అసంతృప్తి బయటపడే అవకాశం ఉంది. పైగా ఈ ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Nizam College Student: ఫీజులు కడతాం పరీక్షకు అనుమతివ్వండి.. నిజాం విద్యార్థుల ఆందోళన