Revanth Reddy: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. చర్చగా మారిన అంశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన ఇంటికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు. ఇరువురు నేతలు కాసేపు చర్చించుకున్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న జానా రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు నాగార్జున సాగర్ టిక్కెట్‌ను ఆయన తనయుడు జై వీర్రెడ్డికి కేటాయించారు. ఆ స్థానం నుంచి జావీర్ విజయం సాధించారు. అయితే తాజాగా సీఎం జానారెడ్డిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
ప్రస్తుతం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో 11 మందికి చోటు దక్కింది. మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతోంది. ముఖ్యమైన హోం శాఖతో పాటు ఎవరికీ కేటాయించని శాఖలు సీఎం వద్ద ఉన్నాయి. అయితే తాజా భేటీ నేపథ్యంలో జానా రెడ్డికి హోం శాఖ దక్కుతుందనే చర్చ మొదలైంది. ఈ విషయంపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి జానా రెడ్డి నివాసానికి వెళ్లినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే మంత్రి పదవులు దక్కాయి. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఉన్నారు. కానీ జానా రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే జిల్లాకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినట్లే. ఈ విషయంలో మిగిలిన జిల్లా నేతల నుంచి కొంత అసంతృప్తి బయటపడే అవకాశం ఉంది. పైగా ఈ ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Nizam College Student: ఫీజులు కడతాం పరీక్షకు అనుమతివ్వండి.. నిజాం విద్యార్థుల ఆందోళన
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!