Site icon NTV Telugu

CM Revanth Reddy : కేసీఆర్‌కు మేము అన్నం పెడితే మాకు సున్నం పెట్టారు

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : శుక్రవారం (జూలై 18) నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ విద్యాసంస్థకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసభలో మాట్లాడుతూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

“కొల్లాపూర్ సెగ్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది,” అని ప్రకటించిన సీఎం రేవంత్, పాలమూరు ప్రజలు దేశంలో ప్రతిభతో నిలుస్తారని గుర్తు చేశారు. 2009లో కేసీఆర్ పాలమూరుకు వలస వచ్చి ఎంపీగా గెలవడం వెనుక ఈ ప్రాంత ప్రజలే ఉన్నారన్నారు. కేసీఆర్ కు మేము అన్నం పెడితే, ఆయన మాకు సున్నం పెట్టారు అని ఆయన విమర్శించారు.

Pet Cats Save Woman: మహిళ ప్రాణాలను కాపాడిన పెంపుడు పిల్లులు..! సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్..

రేవంత్ మాట్లాడుతూ, “కేసీఆర్ మోసపూరిత పాలన వల్లే పాలమూరు ప్రాంతం వెనుకబడింది. 98వ జీవోలో నిర్వాసితుల సమస్యను ఆయన పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోయిన ప్రజలకు సాయం చేస్తానని చెప్పి మోసం చేశాడు,” అని అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి, దానిని కూడా విస్మరించారని ఆరోపించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ సరైన చర్యలు తీసుకోలేదని, “2019లో కాళేశ్వరం నిర్మించి 2023లో కూలిపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం,” అన్నారు. జూరాల రిపేర్లను పట్టించుకోకపోవడాన్ని కూడా విమర్శించారు.

“పాలమూరులోని దళిత, ఆదివాసీ పిల్లల విద్య కోసం యంగ్ ఇండియా స్కూల్‌ను నిర్మిస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి మా ప్రాధాన్యం,” అన్నారు. “కాంగ్రెస్ 14 సీట్లు గెలిచి ఉంటే మరిన్ని మంత్రిత్వ స్థానాలు వచ్చేవి,” అని చెప్పారు.

కేసీఆర్ పాలనలో పాలమూరుకు అన్యాయం జరిగిందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. “20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాలమూరు పచ్చబడేది, కానీ ఆయన 10 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేదు,” అని విమర్శించారు.

Porsche Cayenne: ఈ కారు ధరకు నగరాలలో విలాసవంతమైన ఇంటిని కొనవచ్చుగా.. కొత్త పోర్ష్‌ కయెన్ బ్లాక్ వర్షెన్ రిలీజ్.!

Exit mobile version