NTV Telugu Site icon

CM Revanth Reddy: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. బాచుపల్లి ఘటనపై సీఎం సీరియస్‌

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: హైదరాబాద్‌లో బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సీఎం ఆరా తీశారు. దీనిపై అధికారులను సీఎం రేవంత్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. కుండపోత వర్షం పడడంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు అధికారులు తెలిపారన్నారు. భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడు మంది మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలైనట్లు తెలిపిన అధికారులు సీఎంకు వెల్లడించారు. చనిపోయిన వారు ఒరిస్సా ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారుగా తెలిపారు. చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాబు, ఒక మహిళ, 4 పురుషులు ఉన్నారని వివరించారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Read also: Mr. Bachchan : రవితేజ “మిస్టర్ బచ్చన్” షూటింగ్ అప్డేట్ వైరల్..

పోలీసుల దర్యాప్తు..

బాచుపల్లి ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. హారిజాన్ లగ్జరీ అపార్ట్మెంట్స్ రిటైనింగ్ వాల్ కూలి 7 గురు మృతి చెందగా 6 గురు గాయాలు అయ్యాయని తెలిపారు. హారిజాన్ లగ్జరీ అపార్ట్మెంట్స్ బిల్డర్ అరవింద్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. క్రిమినల్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సమాచారం అందగానే హుటాహుటిన స్పాట్ కి వచ్చామన్నారు. హెచ్ఎండి & ఎన్ డి ఆర్ఎఫ్ & జీహెచ్ఎంసీ & పోలీసులు తెల్లవారు 4 గంటల వరకు రెస్యూ ఆపరేషన్ లో పాల్గొన్నామన్నారు. జెసిబి సహాయంతో శిథిలాల కింద ఉన్న ఏడుగురు మృతదేహాలు వెలికి తీసామన్నారు. ఆరుగురిని ప్రైవేట్ హాస్పిటల్స్ షిఫ్ట్ చేశామన్నారు. వందకు పైగా కార్మికులు సెంట్రింగ్ పని కోసం వచ్చారన్నారు. నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ గోడ కూలడంతో ఘటన జరిగింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఒరిస్సా ఛత్తీస్గడ్ తరలిస్తామన్నారు.

Read also: Revanth Reddy: నిజామాబాద్‌ లో రేవంత్‌ రెడ్డి పర్యటన.. ట్రాఫిక్ మళ్లింపు..

బాచుపల్లి ఘటనపై బాధిత కూలీలు..

నాలుగు నెలల క్రితం బాచుపల్లి వచ్చామని బాచుపల్లి ఘటనపై బాధిత కూలీలు మాట్లాడారు. వందకు పైగా కార్మికులు మేమంతా సెంట్రింగ్ పని కోసం వచ్చామన్నారు. నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ గోడ కూలి మా బంధువులు 7 గురు మృతి చెందారు 6 గురికి గాయాలు అయ్యాయని, ఏడుగురు కార్మికులు రెండు కుటుంబాలకు చెందిన వాళ్ళున్నారని క్లారిటీ ఇచ్చారు. ఒరిస్సాలో ఉన్న మా వాళ్ళకి వెంటనే కాల్ చేసి విషయం చెప్పామన్నారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు పోలీసులు వచ్చారని, మా కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కుండపోత వర్షం కారణంగా ఘటన జరిగిందన్నారు. 4 గురు పురుషులు, ఇద్దరు మహిళలు , నాలుగేళ్ల చిన్నారి చనిపోవడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతానికి మేము ఉండేందుకు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో అధికారులు షెల్టర్ ఇచ్చారని తెలిపారు. అయితే భారీ వర్షం కారణంగా రిటైనింగ్ వాల్ కూలడంతో మాతో వచ్చిన సహచర కూలీలు మృత్యువాత పడ్డారని కన్నీరుమున్నీరుగా విలపించారు.
Farmers Suffering: రైతులను ఆగం చేసిన అకాల వర్షం.. చెల్లాచెదురైన ధాన్యం