NTV Telugu Site icon

TG Assembly: అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి..

Telangana Assembly 2025

Telangana Assembly 2025

TG Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. అనంతరం సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్‌ సింగ్‌ కృషిని కొనియాడారు. ఈతరంలో మన్మోహన్‌ సింగ్‌తో పోటీపడేవారే లేరని అన్నారు. ఎవరు, ఎన్ని విమర్శలు చేసినా.. పనినే ధాసగా మన్మోహన్‌ భావించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక విధానాన్ని సుస్థిరంగా ఉంచగలిగిన వ్యక్తి మన్మో హన్ సింగ్ అన్నారు.

Read also: KTR Tweet: ఇది కక్ష్యా ? శిక్ష్యా? నిర్లక్ష్యమా ?.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్

ఉపాధి హామీ సమాచార హక్కు లాంటి చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ ది అని రేవంత్‌ తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టింది మన్మోహన్ సింగ్ నాయకత్వమే అన్నారు. మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని తెలిపారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో నేను(రేవంత్‌రెడ్డి) వెళ్లి పరిచయం చేసుకున్నా అన్నారు. మన్మోహన్ సింగ్ సతీమణి… నాకు(రేవంత్‌ రెడ్డి) చెప్పిన మాట.. మన్మోహన్ సింగ్ కి తెలంగాణ అంటే ఎంతో ప్రేమ అని తెలిపారు. కష్టపడి పని చేయండి…ఆయన ఆశీస్సులు ఉంటాయని చెప్పారన్నారు. వాళ్ళ పిల్లల్ని ఎన్నో విలువలతో నడిపించారని..తెలంగాణ లో మన్మోహన్ సింగ్… విగ్రహం ఉండాలని తెలిపారు.
Sikandar : `సికింద‌ర్` లో గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ హంటింగ్!

Show comments