Site icon NTV Telugu

CM Revanth : సీరియస్ గా పనిచేయండి.. ఎమ్మెల్యేలకు రేవంత్ క్లాస్..!

Cm Revanth

Cm Revanth

CM Revanth : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు. బుధవారం సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘చాలామంది సీరియస్ గా పనిచేయట్లేదు. ఒకసారి గెలవడం గొప్పకాదు. మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్ప. చాలా మంది బీఆర్ ఎస్ పట్ల సైలెంట్ గా ఉంటున్నారు. అలా చేస్తే మీ మీద అభ్యర్థిని పెట్టరు అనుకుంటున్నారా.. అలా అస్సలు ఊహించుకోకండి. వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నింటికీ ధైర్యంగా ముందుకెళ్లాలి’ అంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్.

Read Also : Thar: థార్ భీభత్సం.. తృటి తప్పించుకున్న పాదచారులు.. వైరల్ వీడియో..

మీటింగ్ మధ్యలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ బయటకు వెళ్లడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ‘ఓ వైపు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే అతనేంటి అలా వెళ్తున్నారు. ఇంత నాన్ సీరియస్ గా ఉంటే ఎలా.. మనం మరోసారి గెలవాలంటే చాలా సీరియస్ గా పనిచేయాల్సిందే. రాజకీయాలు అంటే పిల్లలాటలు కాదు. అందరం కలిసి పనిచేస్తేనే మరోసారి మన ప్రభుత్వం వస్తుంది. కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావొద్దు. ఇక నుంచి అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. వచ్చే నెల 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్ పెట్టుకుందాం. అందరి పనితీరుపై చర్చిద్దాం’ అంటూ సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు.

Read Also : Yogi Adityanath: నేపాల్‌లో ట్రెండ్ అవుతున్న సీఎం యోగి ఆతిథ్యనాథ్.. మరో వివాదం..

Exit mobile version